జాతీయంSouth Central Railway trains | ప్రయాణికులకు అలెర్ట్​.. 6 రైళ్లను క్రమబద్ధీకరించిన దక్షిణ మధ్య...

South Central Railway trains | ప్రయాణికులకు అలెర్ట్​.. 6 రైళ్లను క్రమబద్ధీకరించిన దక్షిణ మధ్య రైల్వే

నిజామాబాద్​ జంక్షన్ మీదుగా నడుస్తున్న 6 వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : South Central Railway trains | నిజామాబాద్​ జంక్షన్ (Nizamabad Junction) మీదుగా నడుస్తున్న 6 వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా రైళ్లకు నూతన నంబర్లు కేటాయించారు.

తిరుపతి – అకోలా (Tirupati-Akola) మార్గంలో నడిచే 07605/06 ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్​ 17429/30గా మారింది. ఈ ట్రైన్​ కాచిగూడ – మహబూబ్ నగర్ – కర్నూలు సిటీ – గుంతకల్లు – ధర్మవరం – పాకాల మీదుగా నడుస్తుంది. కాకినాడ టౌన్ –హిస్సార్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ 07717/18 రైలును క్రమబద్ధీకరిస్తూ 17295/96 నూతన నంబర్లు కేటాయించారు. ఈ రైలు రాజమండ్రి – ఏలూరు – విజయవాడ – గుంటూరు – నల్గొండ – చర్లపల్లి – నిజామాబాద్​ – నాందేడ్ – అకోలా – భూసావల్ – సూరత్ – వడోదరా – రత్లాం – చిత్తోగర్ మీదుగా ప్రయాణిస్తుంది.

South Central Railway trains | కాచిగూడ వీక్లీ ఎక్స్​ప్రెస్​

కాచిగూడ (Kachiguda) నుంచి శ్రీ గంగానగర్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు నంబర్​ను 17601/02గా మార్చారు. ఇది నాందేడ్ – అకోలా – ఖండ్వా – ఇటార్సి – భోపాల్ – ఉజ్జయిని – జైపూర్ – బికనీర్ మీదుగా నడుస్తుంది. నాంపల్లి హైదరాబాద్– జైపూర్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలుకు 17079/80 నంబర్ కేటాయించారు. ఈ రైలు నాందేడ్ – అకోలా – ఖండ్వా -ఇటార్సి – భోపాల్ – ఉజ్జయిని మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఔ

South Central Railway trains | నాందేడ్​–తిరుపతి..

నాందేడ్ నుండి తిరుచానూరు 07015/16 వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును క్రమబద్ధీకరిస్తూ 17633/34 నంబర్​ కేటాయించారు. ఈ రైలు మే 9 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. పెద్దపల్లి – వరంగల్ – విజయవాడ – గూడూరు మీదుగా వెళ్తుంది. నాందేడ్– ధర్మవరం వీక్లీ స్పెషల్ ట్రైన్​కు 17635/36 నంబర్​ కేటాయించారు. ఇది పెద్దపల్లి – వరంగల్ – విజయవాడ – గూడూరు – తిరుపతి – పాకాల – మదనపల్లి మీదుగా నడుస్తుంది.

దీనిని కూడా చదవండి : IPL Betting Suicide | ఐపీఎల్ బెట్టింగ్​కు బలి.. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mumbai Family Death Mystery | పుచ్చకాయ తిని.. ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న కేసులో బిగ్ ట్విస్ట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mumbai Family Death Mystery | ముంబైలో ఒకే...

Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana PRC | పే రివిజన్ కమిషన్...

drunk driving tests | మందుబాబులకు షాక్​.. మధ్యాహ్నం డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : drunk driving tests | మందుబాబులకు హైదరాబాద్​...

Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను విజయవంతం చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో...