Annapurna Seva Rath | ఆప్తులను కోల్పోయిన సమయంలో అండగా.. ‘అన్నపూర్ణ సేవారథం’

కుటుంబంలో ఆప్తులను కోల్పోయిన సమయంలో అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవారథం ప్రారంభిస్తున్నట్టు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Annapurna Seva Rath | కుటుంబంలో ఆప్తులను కోల్పోయిన సమయంలో అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవారథం ప్రారంభిస్తున్నట్టు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.

Annapurna Seva Rath | ఆప్తుల అంత్యక్రియల సమయంలో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్తుల అంత్యక్రియల సమయంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు భోజన ఏర్పాట్లు చేయడం కుటుంబ సభ్యులకు అదనపు భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సేవ అవసరమైన కుటుంబాలు జీసీఆర్ ట్రస్ట్​కు సమాచారం అందిస్తే, అన్నపూర్ణ సేవారథం ద్వారా ఉచితంగా భోజనాన్ని వారి ఇంటి వద్దకే తీసుకువచ్చి అందించనున్నట్టు తెలిపారు. కష్ట సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం, వారి ఇబ్బందులను కొంతవరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సేవను అవసరమైన ప్రతి కుటుంబం వినియోగించుకోవచ్చని, సమాచారం కోసం 9536000333 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Annapurna Seva Rath | సమాచారం ఇవ్వాలి..

ఈ సేవా కార్యక్రమం గురించి ఇతరులకు కూడా తెలియజేసి అవసరమైన వారికి సమాచారం చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్​పర్సన్ గడ్డం ఇందు ప్రియ, కామారెడ్డి జిల్లా (Kamareddy District) సేవాదళ్ అధ్యక్షుడు, మొదటి వార్డు కౌన్సిలర్ గడ్డమీది మహేష్, తాటి ప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షుడు మెహర్ బాబాగౌడ్, మాజీ కౌన్సిలర్లు జమీల్, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, రంగ రమేష్ గౌడ్, మాధవి, శ్రీధర్ రావు, బండారి శ్రీకాంత్, అరవింద్, ఆబిద్, కామారెడ్డి మండల సేవాదళ్ అధ్యక్షులు హరీష్, వేణు, ప్రణీత్, ప్రవీణ్, యూత్ నాయకులు రాహుల్, శశి, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Cultural Heritage | తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *