Ramayana Movie Review | రామాయణం మూవీ రివ్యూ.. విజువల్​ వండర్​గా నిలిచిందా..!

రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా రామాయణం.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ramayana Movie Review | రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా రామాయణం. రణ్‌ బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యష్‌ ప్రధాన పాత్రలతో నితేష్​ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందనేది తెలుసుకుందాం..

Ramayana Movie Review | ఈ సినిమాపై భారీ అంచనాలు

రామాయణం స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ మధ్య ప్రభాస్‌ కూడా ఆదిపురుష్‌ చేయగా.. ఇది డిజాస్టర్‌ అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్‌లో రామాయణం మూవీ తెరకెక్కింది. `రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించారు. ఈ సినిమాపై తొలినుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో రావణుడి వంశస్థులు ఓడిపోతారు. దీంతో దేవతలపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో రావణుడు ఘోర తపస్సు చేస్తారు. ఆ బ్రహ్మ దేవుడి నుంచి మరణం లేకుండా వరం పొందుతాడు. ఈ అహంతో ముల్లోకాలకు అధిపతిగా విర్రవీగుతుంటాడు.

ఈ క్రమంలో దశరథ మహారాజు కుటుంబంలో రామ (రణ్‌బీర్ కపూర్), లక్ష్మణ, భరత, శత్రఘ్నలు జన్మిస్తారు. అనంతరం సీతా (సాయిపల్లవి) స్వయంవరం, రాముడి వనవాసం, సీతాపహరణం లాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది.

Ramayana Movie Review | దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం ఏమిటి?

దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? రావణుడి పుట్టుక, బాల్యం, బ్రహ్మ కోసం తపస్పు వంటి అంశాలు ఎలా సాగాయి? రావణుడికి, శూర్పణఖ (రకుల్ ప్రీత్ సింగ్) భర్త విద్యుత్‌జిత్తు (వివేక్ ఓబెరాయ్) మధ్య వైరం ? రాముడిపై శూర్పణఖ ఎందుకు మనసు పడింది? శూర్పణఖ ముక్కు చెవులు కోసేందుకు రావణుడే కారణం అయ్యాడా? సీతాపహరణం టైంలో జటాయువు పోరాటం? సీత కోసం రామ లక్ష్మణుల వెతుకులాట ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ..

గతంలో వచ్చిన రామాయణ కథలకు భిన్నంగా దర్శకుడు నితీష్ తివారీతీసుకున్న కథ, అనుసరించిన కథనాలు కొత్తగా డిఫరెంట్ ఉన్నాయి. రామాయణం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. దేవతలు, రాక్షసుల యుద్ధం, రావణాసురుడి పరిచయం హైలెట్‌గా చెప్పవచ్చు. టేకాఫ్ అద్భుతంగా సాగిందనే విషయం తెలుస్తోంది. రాముడు, సీత వివాహం తెలిసిన విషయం అందరికి తెలిసిందే. ఇక విజువల్‌ విషయానికి వస్తే భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఫస్టాఫ్ ఎమోషనల్‌గా, గ్రాండ్​గా సాగిందని చెప్పవచ్చు.

సెకండాఫ్‌లో విషయానికి వస్తే.. రావణుడు, శూర్పణఖ భర్త మధ్య ఫైట్ గతంలో మనం తెలుగులో చూడకపోవడం వల్ల థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇక కథలో ట్విస్ట్​ ఏమిటంటే.. రాముడిపై మోజు పడేందుకు, తన ముక్కు కోతకు కారణం రావణుడే అని శూర్పణఖ ఆరోపిస్తుంది. తన సోదరికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకొనేందుకు రావణుడు సీతను అపహరించిన విషయం అందరికి తెలిసింది. కానీ సినిమాలో చూపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఇక జటాయువుతో రావణుడి ఫైట్ మరో హైలెట్‌గా చెప్పవచ్చు.

దర్శకుడిగా నితీష్ తివారీ తన మార్కు రామాయణాన్ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశాడనే చెప్పాలి. పాతతరం ప్రేక్షకులను మెప్పిస్తూనే.. నవతరం ఆడియెన్స్‌కు థ్రిల్‌గా మార్చేలా సినిమాను రూపొందించడంలో సక్సెస్ అయ్యాడనిఅనుకోవచ్చు..

Ramayana Movie Review | నటీనటులు ఎలా చేశారంటే.

మూవీలో రావణాసురుడిగా యష్ విశ్వరూపం చూపించారు. పాత్రకు తగినట్టు బాడీ లాంగ్వేజ్​ మలుచుకొన్న తీరు, ఎక్స్​ప్రెషన్స్​, డైలాగ్ డెలీవరీ బాగున్నాయి. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్ తన వంతుగా బెటర్ పర్​ఫార్మెన్స్​ ఇచ్చాడు. సీతగా సాయి పల్లవి ఎంపిక పర్ఫెక్ట్​గా సెట్​ కాలేదని కొందరి నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఆమె తన పాత్రకు న్యాయం చేసేందుకు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. శూర్ఫణఖగా రకుల్ ప్రీత్ ఒకే అనే చెప్పారు. విద్యుత్ జిత్‌గా వివేక్ ఒబెరాయ్ ఫర్వాలేదనిపించారు.

Ramayana Movie Review | సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయంటే..

వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్​ మూవీని విజువల్ వండర్‌గా మార్చాయి. పురాణ గాధలకు సరిపోయే విధంగా వేసిన బ్యాక్ డ్రాప్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇక పాటలు ఆకట్టుకొనేలా లేకపోవడం కాస్త నిరాశ కలిగించే అంశం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్​ ఉందని చెప్పవచ్చు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి విభాగాల పనితీరు బాగుంది. తెలుగులో ఆకెళ్ల రాసిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే నితీష్ తివారీ రామాయణం మూవీ తెరకెక్కించిన తీరు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. ఈ సినిమా చూస్తే మాత్రం మంచి ఫీల్​ పొందుతారనే చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి..: Jailer 2 Box Office | పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీ దెబ్బకి అక్కడి బాక్సాఫీస్‌ షేక్‌

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *