అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: School Development | ప్రభుత్వ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పలు అభివృద్ధి పనులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal)తో కలిసి ఆయన ప్రారంభించారు.
School Development | విద్యాభివృద్ధికి అనేక చర్యలు..
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56 లక్షలతో నూతన వసతి గృహం, టాయిలెట్స్, రూ.9.50లక్షలతో భవిత కేంద్ర నిర్మాణానికి, రూ.30లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. నూతన తరగతి, వసతి గదులు, మౌలిక వసతుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. అలాగే అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడించారు.
School Development | విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు..
విద్యార్థులకు కాస్మోటిక్, డైట్ ఛార్జీలు పెంచిందని ప్రభుత్వ విప్ తెలిపారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మించనుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కేజీబీవీ, భవిత సెంటర్, ఐకేపీ గోడౌన్ నిర్మాణ పనులను త్వరితగతిన మొదలుపెట్టి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
School Development | రూ. 30లక్షలతో ఐకేపీ గోడౌన్..
కోనరావుపేట మండల కేంద్రంలో రూ.30లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం భూమి పూజ చేశారు. గోడౌన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఫ్యాక్స్ ఛైర్మన్లు చేపూరి గంగాధర్, బొమ్మేన భాస్కర్ రావు, ఆర్డీవో కేఎస్బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, కోనరావుపేట సర్పంచ్ కాశీరామ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బోయిని దేవరాజు, తహశీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: School Inspection | విద్యార్థులు పాఠ్యాంశాలను నిత్యసాధన చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్