అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Motorola Signature 27 | మోటోరోలా కంపెనీ మరో ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. మోటోరోలా సిగ్నేచర్ 27 పేరుతో కొత్త మోడల్‌ను గ్లోబల్ మార్కెట్ (Global market)లో విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీతోపాటు ఆండ్రాయిడ్ 17 ఆధారంగా పనిచేసే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ వినియోగించారు.
నాలుగు వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 1.70 లక్షలుగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఎంపిక చేసిన మార్కెట్లలో సేల్ అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఫోన్ భారత్‌లో వచ్చేనెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.8 ఇంచ్ ఎక్స్‌ట్రీం అమోలెడ్ డ్యుయో ఎల్టీపీవో తాండెమ్ ఓఎలఈడీ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్.. 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1264 2780 పిక్సల్స్ రిజల్యూషన్, 12000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కలిగి ఉండనుంది. ఐపీ68 /ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.
Motorola Signature 27 | ప్రాసెసర్
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌తో వస్తున్న మోటోరోలా సిగ్నేచర్ 27.. ఆండ్రాయిడ్ 17 ఆధారిత గ్రాఫెన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఏడేళ్లపాటు ఓఎస్, ఏడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Motorola Signature 27 | కెమెరా సెటప్..
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో లైన్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉండనుంది. ఇది 8కే వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ : 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ పవర్ చార్జింగ్‌ను, 50డబ్ల్యూ వైర్ లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : పాన్టోన్ కోల్ స్మోక్, పాన్టోన్ కాపులెట్ ఆలివ్ కలర్స్‌లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్. ప్రారంభ ధర రూ. 1.70 లక్షలుగా ఉండే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..: Nov 06 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ