అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Dhanvantari Jayanti Celebrations | నిజామాబాద్(Nizamabad) నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో(Nizamabad Medical College) భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ ఇన్ఛార్జి డాక్టర్ గంగాదాస్ ఆధ్వర్యంలో ధన్వంతరి విగ్రహానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ పూలమాల వేశారు.
Dhanvantari Jayanti Celebrations | క్షీరసాగర మదనంలో..
డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు చివరిగా చేతిలో అమృత కలశంతో ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారంలో ఆవిర్భవించారని తెలిపారు. ఆయుర్వేద వైద్యానికి అధిపతి, దేవతల వైద్యుడైన ధన్వంతరి జయంతిని ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత డాక్టర్ డీఎల్ఎన్ స్వామి, ఆయుర్వేద వైద్యులు శ్రీవాణి, జ్యోత్స్న, అర్వింద్, విజయభాస్కర్, రామకృష్ణ, ఉమా, ఆర్బీఎస్కే ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం వందన, ఆయుష్ ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం, సామాజిక కార్యకర్తలు కొట్టు రమేష్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దివాళీ వేడుకల్లో కృతి సనన్ స్టైలిష్ లుక్..