Head Constable | హెడ్​ కానిస్టేబుల్​ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య

ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్​ పోలీస్​స్టేషన్​ కానిస్టేబుల్​ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Head Constable | ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్(Renjal)​ పోలీస్​స్టేషన్​ కానిస్టేబుల్​ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. బుధవారం కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు.

Head Constable | ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ..

రెంజల్​ పోలీస్​స్టేషన్​లో హెడ్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న తలారి తిరుపతి విధుల్లో భాగంగా ఆర్మూర్​ ఏసీపీ కార్యాలయంలో ఉన్నాడు. అయితే ఆయనకు మంగళవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ఆర్మూర్​లో నిర్వహించగా సీపీ సాయిచైతన్య హాజరయ్యారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. విషాద సమయంలో కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తలారి తిరుపతి మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్యనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రెంజల్ ఎస్సై గంగాధర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకిల్ పాషా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *