Adulterated Milk | హైడ్రోజన్​ పెరాక్సైడ్​తో కల్తీ పాల తయారీ..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్​వోటీ పోలీసులు దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adulterated Milk | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతి దానిని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.

తమ లాభాల కోసం ప్రమాదకరమైన రసాయనాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తోంది. చివరకు పాలను కూడా కల్తీ చేసి విక్రయాలు చేపడుతోంది. తాజాగా కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్​వోటీ పోలీసులు సోదాలు చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Adulterated Milk | నిందితుడి అరెస్ట్​

ఈ పాలను హైదరాబాద్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. పాల వ్యాపారి అండే శ్రీశైలం(43)ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 100 లీటర్ల కల్తీ పాలు, లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లు సీజ్​ చేశారు. నిందితుడు పోచారం గ్రామంలో నివాసం ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు. గ్రామంలో కల్తీ పాలు తయారు చేసి, నగరంలోని పలు ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *