Journalist Award Shirdi | ఇందూరు జర్నలిస్ట్‌కు షిర్డీలో అరుదైన గౌరవం.. సీనియర్ సంపాదకుడు సావల్కర్ శ్రీధర్​కు ఘనసత్కారం

డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సావల్కర్ శ్రీధర్ రావుకు అరుదైన గౌరవం దక్కింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Journalist Award Shirdi | డిచ్‌పల్లి (Dichpally) మండలం ఘన్‌పూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సావల్కర్ శ్రీధర్ రావుకు అరుదైన గౌరవం దక్కింది. షిర్డీలో ‘మాహులి హెల్ప్ ఫౌండేషన్-2026’ ఆధ్వర్యంలో ‘ఉత్తమ జర్నలిస్ట్’ అవార్డుతో ఆయనను ఘనంగా సత్కరించారు.

మహారాష్ట్ర సీఎం కార్యాలయ అధికారిణి మంజూష కులకర్ణి, ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్ ములే, కార్యధ్యక్షురాలు సరళ శేష్, కోపర్గావ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మకరంద్, సకాల్ పత్రిక సంపాదకులు సతీష్ ఆధ్వర్యంలో షిర్డీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్​ జర్నలిస్ట్​ శ్రీధర్ రావుతో పాటు పలు విభాగాలకు చెందిన మరో 32 మందికి అవార్డులు అందజేశారు.

Journalist Award Shirdi | జర్నలిస్ట్​ శ్రీధర్​  ప్రస్థానమిది..

1989లో నిజామాబాద్‌లోని ‘పొద్దు’ దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ పత్రిక అప్పటి కో-ఆర్డినేటర్ రవి అంకం (ప్రస్తుత V6, వెలుగు సీఈవో), సంపాదకులు బైస రామదాసుల ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వార్త, కబురు, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ మిర్రర్ పత్రికల్లో విలేఖరిగా పనిచేశారు. 2014లో హైదరాబాద్‌కు మకాం మార్చాక, జర్నలిస్ట్ పటేల్ మధుసూదన్ రెడ్డి సహకారంతో, దేవరకొండ కాళిదాస్ సంపాదకత్వంలోని ‘మెట్రో ఈవినింగ్స్’ పత్రికలో సీనియర్ జర్నలిస్ట్‌గా చేరారు.

Journalist Award Shirdi | పలు అవార్డులు..

1997లో భగత్ సింగ్ యువజన సంఘం నుండి ‘ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిస్ట్’ అవార్డు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ జన్మభూమి కార్యక్రమంలో మండల స్థాయి ఉత్తమ విలేఖరి సన్మానంతో పాటు లయన్స్, రోటరీ క్లబ్, పీఆర్టీయూ (PRTU), గ్రామాభ్యుదయ మండలి ద్వారా పలు అవార్డులు అందుకున్నారు. సాయిబాబా కొలువైన షిర్డీలో సన్మానం పొందడం పట్ల శ్రీధర్​ రావుతో పాటు అవార్డు గ్రహీతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

128 yuyr

ఇది కూడా చదవండి: SIR వ్యతిరేక నిరసనకు రండి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *