అక్షరటుడే, వెబ్‌డెస్క్: Abhishek Banerjee | కోల్‌కతాలోని తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని మమతా బెనర్జీ (Mamata Banerjee) అల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఎంపీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి టీఎంసీ (మమత), బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఎంపీ నివాసం ఎదుట రాత్రి 2 గంటల సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. బీజేపీ కార్యకర్తలు తన అనుచరులను కొట్టారని, ఇటుకలతో దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కొందరు అభిషేక్ బెనర్జీకి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లను చించివేస్తూ కనిపించారు.
Abhishek Banerjee | హత్య చేయడానికి..
బీజేపీ మద్దతుదారులు తుపాకులతో వచ్చారని ఎంపీ ఆరోపించారు. హత్య చేయడానికే వారు ప్రణాళికతో వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల దాడిలో తన అనుచరులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో తనపై ఏడు సార్లు దాడి చేశారని ఆరోపించారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
Abhishek Banerjee | తప్పుదోవ పట్టించే యత్నం
ఎంపీ ఆరోపణలపై బెంగాల్ బీజేపీ మంత్రి దిలీప్ ఘోష్ స్పందించారు. ఒక నాయకుడి పుట్టినరోజును ఫుట్‌పాత్‌పై జరుపుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాత్రిపూట ఎవరైనా గొడవ చేస్తే, నిరసన సహజమే అన్నారు. అభిషేక్ బెనర్జీని చంపడానికి ఎవరికి సమయం ఉందన్నారు. భావోద్వేగపూరిత ప్రసంగాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Cannabis Cultivation | 458 ఎకరాల్లో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన అధికారులు