India vs New Zealand | రెచ్చిపోయిన భారత బౌలర్లు.. 134 పరుగులకు కివీస్​ ఆలౌట్​

రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో న్యూజిలాండ్ 134 పరుగులకే ఆలౌట్​ అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs New Zealand | న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. కివీస్​ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ శనివారం హెన్రీ స్టేడియంలో రెండో వన్డే ఆడుతోంది. టాస్​ గెలిచిన ఇండియా టీమ్​ (India Team) బౌలింగ్​ ఎంచుకుంది. అనంతరం భారత బౌలర్లు విజృంభించారు. దీంతో పరుగుల ఖాతా ఓపెన్​ చేయకుండానే కివీస్​ తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్​లో ఓపెనర్​ టిమ్​ సిఫెర్ట్​ను నబి ఔట్ చేశాడు. అనంతరం న్యూజిలాండ్​ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

India vs New Zealand | మిచెల్ ఒంటరి పోరాటం

ఓ వైపు వికెట్లు పడుతున్న కివీస్​ బ్యాట్స్​మన్ డారిల్​ మిచెల్​ ఒంటరి పోరాటం చేశాడు. 104 బంతులు ఎదుర్కొని 55 పరుగులతో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. మిచెల్​ సాంథర్ 31 పరుగులతో రాణించాడు. దీంతో కివీస్​ జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్​ అయింది. భారత బౌలర్లలో గుర్నూర్​ బ్రార్ 4, ఔకిబ్​ నబీ 2, అక్షర్​ పటేల్ 2, అన్షుల్ కాంబోజ్​ 2 వికెట్లు తీశారు.

ఇది కూడా చదవండి..: Vaibhav Suryavanshi Captain | క్రీడా చరిత్రలో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 ఏళ్ల వయసులోనే బీహార్ టీ20 కెప్టెన్‌గా అవకాశం.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి జట్టు ప్రకటన!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *