PM SHRI Funds Utilization | పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PM SHRI Funds Utilization | పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. కలెక్టరేట్​లో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, ఎంఈవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.

PM SHRI Funds Utilization | పాఠశాలల వారీగా పనుల పురోగతి..

పాఠశాలల వారీగా పనుల పురోగతి గురించి కలెక్టర్​ తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లే గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సోక్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ తదితర పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. పలు పాఠశాలల్లో చక్కగా పనులు జరిగాయని, మిగతా బడులలో కూడా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వెచ్చిస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు.

వచ్చే వారం నాటికి అన్ని బడులలో 50శాతంకు పైగా నిధుల వెచ్చింపు పూర్తి కావాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే సంబంధిత బిల్లులను ట్రెజరీలో సమర్పించాలని సూచించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని, పనులను వేరే వారికి కేటాయిస్తామని అన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు విధానం(ఎఫ్ఆర్ఎస్) ద్వారానే హాజరు ప్రక్రియ అమలు జరగాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇన్​ఛార్జి డీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రవీందర్  తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Khanapur Fire Accident | ఖానాపూర్​ శివారులో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *