Kanpur Thar Accident | స్కూటర్​ను ఢీకొన్న థార్​.. ఒకరి మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kanpur Thar Accident | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహీంద్రా థార్ కారు అతివేగంగా వచ్చి ఎలక్ట్రిక్​ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

మహిళ నడుపుతున్న థార్​ కారులో ఆమెతో పాటు మరొకరు ఉన్నారు. వాహనం అదుపు తప్పి, రోడ్డుపై ఉన్న మరికొందరిని ఢీకొట్టిన తర్వాత, స్కూటర్‌పై వెళ్తున్న సంతోష్ సింగ్ చౌహాన్‌ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం అనంతరం అందులోని మహిళలు అక్కడినుంచి వెళ్లిపోయారు.

Kanpur Thar Accident | కేసు నమోదు

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదానికి కారణమైన ‘థార్’ వాహనాన్ని గుర్తించారు. ఆ వాహనం వెనుక భాగంలో “కృష్ణ గ్రూప్” అని రాసి ఉంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దిలీప్ కుమార్ సింగ్ తెలిపారు. కారు వేగంగా వచ్చి స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత సుమారు 25 నుంచి 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిందని, చివరకు ఒక రెయిలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Yemen Airstrike Deaths | యెమెన్‌లో వైమానిక దాడి.. రద్దీగా ఉన్న మార్కెట్‌పై బాంబుల వర్షం.. 25 మంది దుర్మరణం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *