Gachibowli Family Suicide | గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gachibowli Family Suicide | హైదరాబాద్‌లోని ( Hyderabad )గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గౌలిదొడ్డిలోని జయభేరి అపార్ట్‌మెంట్స్ (Jayabheri Apartments) సీ-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నవంబర్ 8 ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన వెలుగుచూడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

Gachibowli Family Suicide | పోలీసులకు సమాచారం..

మరణించిన వారిని బాతుల మారెడ్డి, ఆయన భార్య భారతి , కుమారుడు నిశాంత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వీరంతా గత ఏడాదికాలంగా ఈ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. కాగా, కుమారుడు నిశాంత్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని స్థానికులు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఈ ముగ్గురు బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించిన అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.

Gachibowli Family Suicide | కారణాలపై ముమ్మర దర్యాప్తు..

విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రైమ్ సీన్‌ను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో తలెత్తిన తీవ్ర ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ కలహాల వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఏమిటి? వేరే ఏవైనా ఆర్థిక లేదా ఇతర ఒత్తిళ్లు ఉన్నాయా? అనే పలు కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి:  ORR Accident | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *