Amrad Fire Accident | అమ్రాద్​లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

అగ్నిప్రమాదంలో గడ్డివాముకు నిప్పంటుకోగా సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అర్పివేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Amrad Fire Accident | అగ్నిప్రమాదంలో గడ్డివాముకు నిప్పంటుకోగా సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అర్పివేశారు. ఈ ఘటన మాక్లూర్​ మండలం (Makloor Mandal) అమ్రాద్​లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Amrad Fire Accident | నిప్పురవ్వలు పడడంతో..

అగ్ని మాపక శాఖ స్టేషన్​ ఫైర్​ ఆఫీసర్​ శంకర్​ తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్​ మండలంలోని అమ్రాద్​ గ్రామంలో ఆదివారం రాత్రి గడ్డివాముపై నిప్పురవ్వలు పడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు ఫైర్​స్టేషన్​కు ఫోన్​ చేయడంతో శాఖ సిబ్బంది స్పందించారు. సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. రూ.5లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు సుకేష్​ తెలిపారు. స్టేషన్​ ఫైర్​ ఆఫీసర్​ శంకర్​ ఆధ్వర్యలో లీడింగ్​ ఫైర్​ఫైటర్​ ఏసురత్నం, ఫైర్​ ఫైటర్లు ప్రశాంత్​, ఆనంద్​, సాయిలు, శీను పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Women Kabaddi Coach | ఖేలో ఇండియా యూత్ గేమ్స్​లో రాష్ట్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్​గా మీసాల ప్రశాంత్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *