అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nov 12 Market Analysis | యూఎస్ కు చెందిన నియోక్లౌడ్ సంస్థ కోర్‌వీవ్ ఇంక్ (CoreWeave Inc.) కంపెనీ 3వ త్రైమాసిక ఫలితాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో పెట్టుబడులు, సంబంధిత మౌలిక సదుపాయాల విస్తరణపై పెట్టుబడిదారుల ఆశావాదాన్ని నిలబెట్టాయి.
దీంతో గత సెషన్లో వాల్ స్ట్రీట్ బెంచ్‌మార్క్ సూచీలు పుంజుకున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం, క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడంతో ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Nov 12 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 1.75 శాతం, ఎస్ అండ్ పీ 1.31 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.12 శాతం లాభంతో ఉంది.
Nov 12 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.18 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.19 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.77 శాతం లాభంతో ముగిశాయి.
Nov 12 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.11 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.79 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.54 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.43 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.27 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.02 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 12,563 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా తొమ్మిదో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 8,434 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి 93.69 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.85 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.99 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.23 నుంచి 0.98 కు తగ్గింది.
- విక్స్ 0.77 శాతం పెరిగి 17.55 వద్ద ఉంది. విక్స్ 14 కన్నా కిందికి తగ్గితే బుల్స్‌కు మరింత సానుకూలంగా ఉంటుంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.05 డాలర్ల వద్ద ఉంది.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.