అక్షరటుడే వెబ్డెస్క్: Mumbai Local Train Attack | ముంబై నగరానికి జీవనాడిగా పిలువబడే లోకల్ రైళ్లలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కదులుతున్న రైలులో తనను అసభ్యంగా తాకిన వ్యక్తిని నిలదీసినందుకు, ఓ 20 ఏళ్ల యువతిని దుండగుడు బయటకు తోసేసిన అత్యంత దారుణ ఘటన నవంబర్ 4న నైగావ్ (Naigaon) రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలు లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా, ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ యువతి ధైర్యంగా అతని చర్యను అడ్డుకుని నిలదీసింది.
Mumbai Local Train Attack | తీవ్ర గాయాలు..
యువతి తనను నిలదీయడంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు, రైలు నైగావ్ స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో ఆమెను కదులుతున్న బోగీ నుంచి బలంగా కిందకు తోసేశాడు. దీంతో ఆమె నేరుగా పట్టాలపై పడిపోయింది. ఈ క్రమంలో రైలు చక్రాల కింద నలిగి ఆమె ఎడమ చేయి తెగిపడటంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.
Mumbai Local Train Attack | సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు అప్రమత్తమై ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ నెలకొన్న గందరగోళాన్ని ఆసరాగా తీసుకుని 53 ఏళ్ల నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, భయందర్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) రంగంలోకి దిగి స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నవంబర్ 9న నైగావ్కు చెందిన సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
𝐌𝐨𝐥𝐞𝐬𝐭𝐚𝐭𝐢𝐨𝐧 𝐡𝐨𝐫𝐫𝐨𝐫 𝐨𝐧 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐥𝐨𝐜𝐚𝐥! 𝐖𝐨𝐦𝐚𝐧 𝐥𝐨𝐬𝐞𝐬 𝐥𝐞𝐟𝐭 𝐚𝐫𝐦 𝐚𝐟𝐭𝐞𝐫 𝐛𝐞𝐢𝐧𝐠 𝐩𝐮𝐬𝐡𝐞𝐝 𝐨𝐧𝐭𝐨 𝐭𝐫𝐚𝐜𝐤𝐬 |
ks at Naigaon station for resisting an alleged molestation attempt. The incident took place on November 4, when the woman was travelling from Borivali towards Naigaon. According to her complaint, the accused allegedly behaved inappropriately with her during the journey. When she confronted him at Naigaon station, an argument broke out, during which both reportedly threw their footwear at each other. Amid the altercation, the accused allegedly pushed her with both hands, causing her to fall through the gap between two coaches onto the tracks. As the local train started moving, her left arm came under its wheels and was severed near the elbow. She was rescued with the help of railway personnel and fellow passengers and rushed for medical treatment. The accused 53-year-old Naigaon resident, reportedly fled the scene, taking advantage of the commotion. However, the Bhayandar Government Railway Police (GRP) arrested him on November 9 after examining CCTV footage and conducting a technical investigation
— MUMBAI NEWS (@Mumbaikhabar9) November 12, 2026
ఇది కూడా చదవండి: Annapurna Seva Ratham | అన్నపూర్ణ సేవా రథం పోస్టర్ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్