అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gift Nifty Market Signals | గత సెషన్‌లో వాల్ స్ట్రీట్(Wall street) నష్టాలతో ముగియగా.. శుక్రవారం టెక్ దిగ్గజాలైన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో., ఎస్కే హైనిక్స్ ఇంక్., తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో. షేర్ల అండతో దక్షిణ కొరియా, తైవాన్ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift Nifty) నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gift Nifty Market Signals | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.39 శాతం, ఎస్ అండ్ పీ 0.35 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.19 శాతం లాభంతో ఉంది.
Gift Nifty Market Signals | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.41 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.34 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.25 శాతం లాభంతో ముగిశాయి.
Gift Nifty Market Signals | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.09 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.40 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.36 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.19 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.77 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.66 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.28 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Gift Nifty Market Signals | గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 7,830 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా పదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 6,331 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు బలహీనపడి 94.04 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.16 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.13 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.98 నుంచి 1.00 కు పెరిగింది.
- విక్స్ 5.34 శాతం తగ్గి 16.61 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.70 డాలర్ల వద్ద ఉంది.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాలతో ముగిసిన సూచీలు