Telangana Employees Strike | ఉద్యోగుల సామూహిక సెలవుపై సర్కార్ సీరియస్.. గైర్హాజరైతే కఠిన చర్యలు!

ఈ సామూహిక సెలవులో ఉపాధ్యాయులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Employees Strike | తెలంగాణలో ఉద్యోగుల సామూహిక సెలవు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఉద్యోగ సంఘాలు చేపట్టిన సామూహిక సెలవు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. విధులకు హాజరుకాకుండా సెలవులో పాల్గొనే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Telangana Employees Strike | OPS అమలు చేయాలంటూ ఉద్యోగుల డిమాండ్

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను తిరిగి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ సాధన కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు పాటించాలని పిలుపునిచ్చాయి.

Telangana Employees Strike | ఉద్యోగులపై సర్కార్ కఠిన వైఖరి?

ఈ సామూహిక సెలవులో ఉపాధ్యాయులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఉద్యోగుల ఈ నిర్ణయంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీసీఏ (CCA) నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Telangana Employees Strike | ఉద్యోగ సంఘాల తదుపరి అడుగు ఏమిటి?

ఒకవైపు OPS అమలు కోసం ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని భావిస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక సెలవు కార్యక్రమం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది.

OPS Protest | OPS కోసం రేపు CPS ఉద్యోగుల సామూహిక సెలవు.. సర్కారు తీవ్ర హెచ్చరికలు!
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *