అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nov 17 Market Analysis | ఎన్విడియా(NVIDIA Corp) 3వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ షేర్లలో విస్తృత అమ్మకాల ఒత్తిడి కారణంగా గత సెషన్లో వాల్‌స్ట్రీట్(Wall street) నష్టాలతో ముగిసింది.
దీని ప్రభావంతో మంగళవారం ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే నిరంతర విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఇన్‌ఫ్లోలు, తగ్గుతున్న ముడి చమురు ధరల మద్దతుతో భారత ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nov 17 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 2.49 శాతం, ఎస్ అండ్ పీ 1.91 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం నష్టంతో ఉంది.
Nov 17 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.57 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.20 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.19 శాతం నష్టంతో ముగిశాయి.
Nov 17 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.43 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.37 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.26 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.88 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.82 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.60 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉండడంతో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఐదో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 4,864 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా పన్నెండో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 3,519 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు బలపడి 93.92 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.64 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.13 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.98 నుంచి 1.03 కి పెరిగింది.
- విక్స్ 1.18 శాతం పెరిగి 15.68 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.77 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.