OPS Protest | OPS కోసం రేపు CPS ఉద్యోగుల సామూహిక సెలవు.. సర్కారు తీవ్ర హెచ్చరికలు!

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఈ ఆందోళన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: OPS Protest | తెలంగాణ Telangana లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి మరోసారి నిరసన సెగ తగలనుంది. పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.15 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు నవంబర్ 17న సామూహిక సెలవు పాటించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఈ ఆందోళన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

OPS Protest | న్నికల హామీ అమలుపై కాంగ్రెస్‌కు ఉద్యోగుల ప్రశ్నలు!

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పెన్షన్ అంశంపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా CPS రద్దు చేసి OPS పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) నేతలు కోరుతున్నారు.

OPS Protest | భారీ నిరసనకు సిద్ధం

రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది CPS ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండగా, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న 45 వేల మందికి మినహాయింపు ఇచ్చినట్లు యూనియన్ వెల్లడించింది.

మిగతా 2.15 లక్షల మంది సామూహిక సెలవు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు సామూహిక సెలవు కోసం దరఖాస్తులు సమర్పించినట్లు యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిరసనకు పలు ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు.

OPS Protest | ఉద్యోగుల ఆర్థిక భద్రతే ప్రధాన అజెండా

CPS విధానంలో ఉద్యోగులు తమ వేతనంలో 10 శాతం వరకు పెన్షన్ కోసం జమ చేస్తున్నప్పటికీ, పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన పెన్షన్, వైద్య భద్రత విషయంలో అనిశ్చితి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే CPS రద్దు చేసి OPS అమలు చేయాలని పట్టుబడుతున్నారు.

మరోవైపు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) కూడా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. OPS పునరుద్ధరణతో పాటు రెండో వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయుల పదోన్నతులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత వంటి మొత్తం 42 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతోంది.

ఎన్నికల సమయంలో ఉద్యోగుల మద్దతు కీలకంగా భావించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదే ఉద్యోగ వర్గాల నుంచి నిరసన ఎదురవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సామూహిక సెలవు, ధర్మదీక్షలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

OPS Protest | సర్కారు తీవ్ర హెచ్చరికలు

ఇదిలా ఉంటే.. సీపీఎస్​ ఉద్యోగుల సామూహిక సెలవులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే సస్పెన్షన్​కు వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. దీనికితోడు సామూహిక సెలవులు పెట్టొద్దని టీఎన్జీవోస్​ స్టేట్​ కమిటీ ద్వారా బలవంతంగా ప్రకటన విడుదల చేయించినట్లు తెలుస్తోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *