Ward Member Disqualification | వార్డు సభ్యుడిపై అనర్హత వేటు!

పోచంపాడ్ జీపీలో వరుసగా మూడు సాధారణ సమావేశాలకు గైర్హాజరైన 11వ వార్డు సభ్యుడు అల్ల భాస్కర్‌కు నోటీసు జారీ అయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Ward Member Disqualification | నిజామాబాద్​ జిల్లా పోచంపాడ్ జీపీలో వరుసగా మూడు సాధారణ సమావేశాలకు గైర్హాజరైన 11వ వార్డు సభ్యుడు అల్ల భాస్కర్‌కు నోటీసు జారీ అయింది. ఈ మేరకు  జిల్లా పంచాయతీ అధికారి (Nizamabad) సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Ward Member Disqualification | తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018..

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని నిబంధనల ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026 జులై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ 2 తేదీల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ సాధారణ సమావేశాలకు ఆయన హాజరుకాలేదని నోటీసులో వివరించారు.

సమావేశాల ఎజెండా నోటీసులను జులై 1, జులై 31, ఆగస్టు 29 తేదీల్లో జారీ చేయగా.. సమావేశాలు వరుసగా జులై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ 2 తేదీల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 25(డి), సెక్షన్ 27(1) నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఆక్వాన్ తుపాన్ పేరును..పెట్టిన దేశం ఏదో తెలుసా..? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *