Charlapalli Fire | చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన రైలు బోగీలు!

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Charlapalli Fire | హైదరాబాద్​లోని చర్లపల్లి Charlapalli రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. మంటల ధాటికి రైలుకు చెందిన కొన్ని బోగీలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.

Charlapalli Fire | సిబ్బంది వేగంగా స్పందించడంతో..

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు, బోగీలకు జరిగిన నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *