Aasara Pensions | అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు..: షబ్బీర్​ అలీ

పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Aasara Pensions | పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

Aasara Pensions | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో..

ఈ సందర్భంగా మట్కాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 797 నూతన పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు తదితర విభాగాల్లో అర్హత కలిగిన వారికి ఈ పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబ పోషణకు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఉన్న పేదలకు పెన్షన్ ఒక ఆర్థిక భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, భర్తను కోల్పోయిన మహిళలు, అంగవైకల్యంతో జీవనం సాగిస్తున్న వారు, ఒంటరి మహిళలు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 797 పెన్షన్లు మంజూరు కాగా, మరో 200కు పైగా వినతిపత్రాలు తమకు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేణి సందీప్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్, మాజీద్, వాజిద్, భూపతి, అంజద్, నిట్టు వెంకట్రావు, గంప ప్రసాద్, అజ్మత్, ఖదీర్, ఉరుదొండ ప్రవీణ్, సంతోష రావు తదితరులు పాల్గొన్నారు.

Aasara Pensions | మెడికల్ కళాశాల అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు

778

అక్షరటుడే, కామారెడ్డి: మెడికల్ కళాశాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.24.40 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులకు ప్రభుత్వం అదనంగా రూ.24.40 కోట్లు మంజూరు చేసిందని, ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ జిఓ నంబర్ 175 జారీ చేసిందని చెప్పారు.

Aasara Pensions |కళాశాలలో పలు అభివృద్ధి పనులు..

గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్‌కు అదనపు ఫ్లోర్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు, గ్రీనరీ, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫస్ట్ ఫ్లోర్‌లో క్యాంటీన్ ఏర్పాటు, నేమ్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే అదనంగా రెండు లిఫ్టుల ఏర్పాటు, ప్లే గ్రౌండ్ అభివృద్ధి, లెక్చర్ హాళ్లలో అకౌస్టిక్ ప్యానెల్స్ ఏర్పాటు పనులు ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మెడికల్ కళాశాల ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్, సిబ్బంది, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తుపాన్లకు స్పెషల్ గా పేర్లు ఎందుకు పెడతారంటే..? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *