అక్షరటుడే వెబ్‌డెస్క్: Forever52 Makeup Contest | మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. తన ‘అకడమిక్ బై ఫరెవర్52’ (Academic by Forever52) ద్వారా సరికొత్త దేశవ్యాప్త మేకప్ టాలెంట్ పోటీని ప్రారంభించింది. ఈ పోటీలో గెలిచిన తుది విజేతకు దుబాయ్‌కి ( Dubai ) ప్రయాణించి, అక్కడ ఒక అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్ట్ వద్ద శిక్షణ పొందే సువర్ణావకాశం లభిస్తుంది. అంతేకాకుండా, ప్రఖ్యాత భారతీయ మేకప్ శిక్షకురాలు భూమిక బహల్ ఆధ్వర్యంలో నేర్చుకునే అరుదైన అవకాశం కూడా విజేతకు దక్కుతుంది. చిన్న నగరాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వర్ధమాన మేకప్ ఆర్టిస్టులు, విద్యార్థులు, బ్యూటీ కంటెంట్ క్రియేటర్లు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇదొక చక్కటి వేదికగా నిలుస్తోంది.
Forever52 Makeup Contest | పోటీలో పాల్గొనే విధానం..
ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు కనీసం ఒక ‘అకాడమిక్ బై ఫరెవర్52’ ఉత్పత్తిని ఉపయోగించి ఒక ఒరిజినల్ మేకప్ లుక్‌ను సృష్టించాలి. దానితో పాటు ఒక ప్రొఫెషనల్ మేకప్ చిట్కాను పంచుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల నుంచి నలుగురు సెమీ-ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు. వారిలో నుంచి ఒకరిని తుది విజేతగా ప్రకటిస్తారు. విజేతకు భూమిక బహల్, ఫరెవర్52 బృందంతో కలిసి మూడు రోజుల పాటు దుబాయ్ అనుభవాలు పొందే అవకాశం, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక సర్టిఫికేషన్ లభిస్తాయి. ఇక మిగిలిన ముగ్గురు సెమీ-ఫైనలిస్టులకు ప్రత్యేకంగా ‘అకాడమిక్ బై ఫరెవర్52 సిరీస్ వానిటీ’ బహుమతితో పాటు, ఢిల్లీలోని భూమిక బహల్ అకాడమీలో ఒక రోజు ప్రత్యేకంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తారు.
Forever52 Makeup Contest | చివరి తేదీ..
మేకప్ ప్రతిభను గుర్తించి, యువ నిపుణులను ప్రోత్సహించడానికి ఫరెవర్52 సంస్థ నిరంతరం వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలోనూ పలు విజయవంతమైన సీజన్ల ద్వారా వందలాది మందికి మేకప్ వానిటీలు, నగదు బహుమతులు అందజేయడంతో పాటు దుబాయ్ పర్యటనలకు అవకాశం కల్పించింది. ఇప్పుడు తాజాగా ప్రారంభించిన ఈ పోటీకి దరఖాస్తు చేసుకోవడానికి 2026 డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల (IST) వరకు గడువు ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలు, పూర్తి మార్గదర్శకాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో @academicbyforever52 అధికారిక పేజీని సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: Nimbachala Brahmotsavams | శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ