అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DBS Wealth Branch Hyd | దేశంలోని ప్రధాన నగరాల్లో తన సంపద నిర్వహణ (వెల్త్ బ్యాంకింగ్) సేవలను మరింత విస్తరించే దిశగా డీబీఎస్ బ్యాంక్ ఇండియా (DBS Bank India) కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్‌లో సరికొత్త ‘డీబీఎస్ ట్రెజర్స్ వెల్త్ బ్రాంచ్’ను ప్రారంభించినట్లు బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకింగ్, పెట్టుబడులు , సంపద నిర్వహణ నిపుణుల సేవలను ఒకే వేదికపై అందించేలా దీనిని తీర్చిదిద్దారు. 2027 నాటికి ఆసియా వ్యాప్తంగా 18 కొత్త వెల్త్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న 36 బ్రాంచ్‌లను ఆధునీకరించాలనే డీబీఎస్ గ్రూప్ వ్యూహంలో భాగంగా ఈ విస్తరణ జరిగింది.
DBS Wealth Branch Hyd | ప్రత్యేక వెల్త్ ఎకోసిస్టమ్..
అధిక సంపద కలిగిన వ్యక్తులు (HNI), అల్ట్రా హై నెట్-వర్త్ (UHNI) కస్టమర్ల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బంజారాహిల్స్ బ్రాంచ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇక్కడ ఖాతాదారులకు ప్రత్యేకమైన ట్రెజర్స్ రిలేషన్‌షిప్ మేనేజర్లు, వెల్త్ స్పెషలిస్టులు , అంతర్జాతీయ బ్యాంకింగ్, క్రాస్-బార్డర్ పోర్ట్‌ఫోలియో నిర్వహణలో సహాయపడే ఎన్ఆర్ఐ (NRI) నిపుణుల సేవలు నేరుగా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, అర్హులైన కస్టమర్లు ‘డీబీఎస్ ట్రెజర్స్ ఇంటర్నేషనల్’ ప్రోగ్రామ్ ద్వారా డీబీఎస్ అంతర్జాతీయ నెట్‌వర్క్ పరిధిలో ప్రత్యేక బ్యాంకింగ్ ప్రయోజనాలను పొందవచ్చు.
DBS Wealth Branch Hyd | ఖాతాదారుల అర్హత ..
వినియోగదారుల పెట్టుబడులు, ఆర్థిక స్థాయిని బట్టి డీబీఎస్ బ్యాంక్ మూడు రకాల ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ. 30 లక్షల నుంచి రూ. 2 కోట్ల లోపు టోటల్ రిలేషన్‌షిప్ వాల్యూ (TRV) కలిగిన ఖాతాదారుల కోసం డీబీఎస్ ట్రెజర్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ. 2 కోట్ల నుంచి రూ. 6 కోట్ల లోపు TRV కలిగిన కస్టమర్ల కోసం డీబీఎస్ ట్రెజర్స్ గోల్డ్, రూ. 6 కోట్లు ఆపైబడి TRV కలిగిన అల్ట్రా హై నెట్-వర్త్ ఖాతాదారుల కోసం డీబీఎస్ ట్రెజర్స్ ప్రైవేట్ క్లయింట్ విభాగాల ద్వారా ప్రత్యేక సలహా , బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు.
DBS Wealth Branch Hyd | పెరుగుతున్న సంపదకు అనుగుణంగా సేవలు: అంబుజ్ చందనా
ఈ సందర్భంగా డీబీఎస్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ అంబుజ్ చందనా మాట్లాడుతూ.. భారతదేశంలో పెరుగుతున్న సంపద కారణంగా స్థానిక మార్కెట్ అవగాహనతో పాటు అంతర్జాతీయ అనుసంధానం కలిగిన వెల్త్ సొల్యూషన్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న సంపన్న వర్గాలకు మెరుగైన సేవలు అందించడంలో ఈ బ్రాంచ్ ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Fake liquor racket | క్యాబ్ డ్రైవర్ ముసుగులో నకిలీ మద్యం దందా.. గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ అధికారులు!