Canada | కెనడాలో భారతీయుడి హత్య

కెనడాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలో గల లాంగ్లీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Canada | కెనడా (Canada)లో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలో గల లాంగ్లీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని తుషార్​ శర్మ (25)గా పోలీసులు గుర్తించారు.

లాంగ్లీలోని రావ్లిన్సన్ క్రెసెంట్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ కారు కాలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఆ సమయంలో కారులో ఓ వ్యక్తి అవశేషాలను గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తిని హత్య చేశారని భావించారు. ఈ మేరకు కేసును ‘ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (IHIT)కు అప్పగించారు.

Canada | ఎవరు చంపారు

తుషార్ శర్మ మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడారు. తుషార్ శర్మకు ఎటువంటి నేర చరిత్ర లేదని, కెనడాలో ఆయనకు పెద్దగా సామాజిక పరిచయాలు కూడా లేవని తెలిపారు. తుషార్​ శర్మను ఎవరు చంపారు, ఎందుకు చంపారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Trump Putin Meeting | పుతిన్​తో డొనాల్డ్​ ట్రంప్​ భేటీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *