అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Development | భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోందని ప్రధాని మోదీ (Prime Minister Modi) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గత 13 ఏళ్లలో దేశం సాధించిన పురోగతిపై ఫొటోలు షేర్ చేశారు.
జీటీఏ 6 విడుదల సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 2013లో జీటీఏ 5, తాజాగా జీటీఏ 6 మధ్య భారత్ ఎంత అభివృద్ధి చెందిందో సూచించేలా ఆయన జీటీఏ స్టైల్ ఫొటోలను షేర్ చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని ఆ పోస్ట్ పేర్కొంది. అప్పుడు భారత్‌లో 27 శాతం మంది తీవ్ర పేదరికంలో ఉండా.. ఇప్పుడు ఆ సంఖ్య 2.6 శాతానికి తగ్గిందని తెలిపారు. పారిశుధ్య మిషన్ పూర్తి, సౌర విద్యుత్ సామర్థ్యం పెంపు, 440 అంతరిక్ష సాంకేతిక స్టార్టప్‌లు వంటి అంశాలను ఆయన పోస్ట్‌లో ప్రస్తావించారు.
India Development | ఇంటర్నెట్ ధరపై..
హై-స్పీడ్ ఇంటర్నెట్ ధర గిగాబైట్‌కు (GB) రూ. 308 నుండి రూ. 7.51కి ఎలా తగ్గిందో కూడా ప్రధాని వివరించారు. భారతదేశం నక్సలిజం రహితంగా మారిందని, అగ్రగామి రక్షణ ఎగుమతిదారుగా ఆవిర్భావించిందన్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్‌లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా GTA 5 విడుదలైన 13 ఏళ్ల తర్వాత, బుధవారం అర్ధరాత్రి GTA 6 విడుదలైంది.
ఇది కూడా చదవండి..: Bangladesh Political Violence | మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. బాంబు పేలుళ్లు, దహనకాండలతో 28 జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత