అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ప్రతికూలంగా ఉన్నా.. దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం కోలుకుంది. నిరంతరాయంగా సాగుతున్న ఎఫఐఐ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి విలువ బలపడుతుండడంతోపాటు ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో ప్రధాన ఈక్విటీ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాటలో సాగుతున్నాయి.
Indian Stock Market | మిక్స్‌డ్ గా ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం మిక్స్‌డ్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 333 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల నుంచి కోలుకుని641 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 41 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైనా మొదట్లో 82 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 223 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 291 పాయింట్ల లాభంతో 82,323 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 25,320 వద్ద ఉన్నాయి.
Indian Stock Market | ఆటోలో దూకుడు.. ఐటీలో ఆగని పతనం..
ఆటో స్టాక్స్ దూకుడు మీదున్నాయి. ఆటో ఇండెక్స్ 3.85 శాతం పెరిగింది. కన్జూమర్ డ్యూరెబుల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌లో పతనం కొనసాగుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో, 7 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. మారుతి 5.95 శాతం, ఎం అండ్ ఎం 4.54 శాతం, హెచ్యూఎల్ 2.05 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.63 శాతం, టాటా స్టీల్ 1.34 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 2.32 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.52 శాతం, టెక్ మహీంద్రా 1.42 శాతం, ఎటర్నల్ 1.13 శాతం, టీసీఎస్ 0.91 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Mahanadi Coalfields IPO | ఐపీవోకు కోల్ ఇండియా అనుబంధ సంస్థ నేటినుంచి సబ్‌స్క్రిప్షన్ స్వీకరణ