అక్షరటుడే, వెబ్డెస్క్: Trump Putin Meeting | చైనాలో జరుగుతున్న 33వ APEC ఆర్థిక నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. తాము ఈ సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామన్నారు. తమ మధ్య చాలా ఏళ్లుగా అద్భుతమైన సంబంధం ఉందని పేర్కొన్నారు. తాము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని, ఈ సమావేశం ద్వారా ఎన్నో గొప్ప ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. కనీసం మంచి ప్రారంభం లభిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మాకు మరో సమావేశం కూడా ఉండబోతోందుని తెలిపారు.
Trump Putin Meeting | ఉక్రెయిన్ యుద్ధంపై..
ట్రంప్, పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని తగ్గించే ఒప్పందాన్ని కుదర్చడంలో గత ఏడాది అలస్కాలో విఫలమైన వారి చర్చల తర్వాత, ఈ ఇద్దరు నాయకులు చర్చలు జరపడం ఇదే మొదటిసారి. కాగా అమెరికా ఇటీవల రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో పలు వాణిజ్య అంశాలపై సైతం ఇరుదేశాల అధ్యక్షులు చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి..: Rare Vision Disorder | మనుషుల ముఖాల్లో పిల్లి కళ్లు.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి విచిత్ర సమస్య..