అక్షరటుడే, వెబ్‌డెస్క్: SI Hall Tickets | తెలంగాణ (Telangana) రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) సబ్-ఇన్‌స్పెక్టర్లు పోస్టుల కోసం ప్రిలిమినరీ రాత పరీక్షను నవంబర్ 29న నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తాజాగా విడుదల చేసింది.
మొత్తం 275 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి కోసం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. నవంబర్ 22న ఉదయం 8 గంటల నుండి నవంబర్ 28న అర్ధరాత్రి వరకు http://tgprb.in లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SI Hall Tickets |ఫొటో అతికించాలి
హాల్ టికెట్‌ను ప్రింట్ తీసుకొని, దానిపై దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోనే అతికించాలి. ఫొటో లేకుండా, అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు. పరీక్షకు ఒక గంట ముందు ప్రవేశం ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు వేలిముద్ర, ఫొటోగ్రాఫ్, సంతకం, ఆధార్ ముఖ ధృవీకరణ చేయించుకోవాలి. ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి..: MLA Rajagopal Reddy | ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి.. సీఎంకు రాజగోపాల్‌రెడ్డి కౌంటర్