ASBL Legacy Hyderabad | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ లాంచ్.. తొలి రోజే రూ.800 కోట్ల విక్రయాలు..

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో తొలి పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీ నివాస ప్రాజెక్టుగా 'ఏఎస్‌బీఎల్ లెగసీ' ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ASBL Legacy Hyderabad | హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో తొలి పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీ నివాస ప్రాజెక్టుగా ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ (ASBL Legacy) ప్రారంభమైంది. సెంట్రల్ హైదరాబాద్‌లో సంస్థ చేపడుతున్న మొట్టమొదటి నివాస ప్రాజెక్టు అయిన ఇది, ప్రారంభ రోజే రూ.800 కోట్ల విలువైన విక్రయాలను నమోదు చేసింది. ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన నివాస భవన సముదాయంగా ఇది నిలవనుంది. లాంచ్ సందర్భంగా కొనుగోలుదారుల కోసం ‘హ్యాండ్‌ఓవర్ వరకు జీరో ఈఎంఐ’ (Zero EMI till handover) ప్రత్యేక ఆఫర్‌ను కూడా సంస్థ ప్రకటించింది.

ASBL Legacy Hyderabad | ఆఫర్ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా నిర్మాణంలో ఉన్న ఇంటికి హోమ్ లోన్ తీసుకుంటే, నిర్మాణ దశలను బట్టి బ్యాంకు రుణం విడుదల చేస్తుంది. ఆ మేరకు కస్టమర్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యే కొద్దీ ఈ వడ్డీ పెరిగి పూర్తి ఈఎంఐగా మారుతుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి లేదా ఇప్పటికే మరో లోన్ ఉన్న వారికి ఇది అదనపు ఆర్థిక భారం అవుతుంది. మార్కెట్‌లో చాలా ప్రీ-ఈఎంఐ ఆఫర్లు తొలి స్లాబ్ పూర్తయ్యే వరకు మాత్రమే వెసులుబాటు ఇస్తాయి. అయితే ఏఎస్‌బీఎల్ ఆఫర్ ప్రకారం.. కొనుగోలుదారులు బుకింగ్ మొత్తం చెల్లించిన తర్వాత, మొదటి అధికారిక హ్యాండ్‌ఓవర్ సమాచారం వచ్చే వరకు నిర్మాణ కాలం మొత్తానికి అయ్యే వడ్డీని సంస్థే భరిస్తుంది. మిగిలిన ఇంటి మొత్తాన్ని హ్యాండ్‌ఓవర్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.

ASBL Legacy Hyderabad | గేటెడ్ కమ్యూనిటీ అవసరం..

ప్రాజెక్టు విశేషాలపై ఏఎస్‌బీఎల్ సీఈఓ, వ్యవస్థాపకులు అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ.. హైదరాబాద్ వేగంగా పశ్చిమ దిశగా విస్తరించడానికి అక్కడ పెద్ద భూములు అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని అన్నారు. సెంట్రల్ హైదరాబాద్‌లో డిమాండ్‌కు ఎప్పుడూ కొరత లేదని, కానీ మంచి గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి సరిపడా పెద్ద స్థలాలు లేకపోవడమే నాణ్యమైన నివాసాల కొరతకు అసలు కారణమని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నల్లకుంట, హిమాయత్‌నగర్ వాసులు ఇప్పటివరకు ఇలాంటి జీవనశైలి కోసం పశ్చిమ హైదరాబాద్ వైపు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు తమ ప్రాంతంలోనే అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు.

ASBL Legacy Hyderabad | ప్రాజెక్టు ప్రత్యేకతలు..

సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో మూడు నివాస టవర్లతో జీ+50 అంతస్తుల ఎత్తులో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు అందుబాటులో ఉండగా, వీటి ప్రారంభ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్టులో 73.25 శాతం ఓపెన్ స్పేస్, 74,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ( Clubhouse ), సుమారు 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 50కి పైగా సదుపాయాలు కల్పిస్తున్నారు. డబుల్ హైట్ లాబీ, రెండు మీటర్ల వెడల్పు కారిడార్లు, ప్రతి అంతస్తులో ఒక్కో యూనిట్‌కు ఒక లిఫ్ట్, అవుట్‌డోర్ లివింగ్ ఏరియాలు వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్‌కు రెండు నిమిషాలు, కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఎనిమిది నిమిషాలు, ఎంజీబీఎస్‌కు సుమారు 15 నిమిషాల ప్రయాణ దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.

ఇది కూడా చదవండి:  Vemulawada Development | వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *