Lalita Jewellery IPO | ఐపీవోకు లలితా జువెలరీ మార్ట్.. 17 నుంచి అందుబాటులోకి..

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lalita Jewellery IPO | తమిళనాడులోని చెన్నై టినగర్‌లో 1985 సంవత్సరంలో లలితా జువెలరీ మొదటి స్టోర్‌ను ప్రారంభించారు. ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న ప్రకటనతో ఈ కంపెనీ జనంలోకి చొచ్చుకువెళ్లింది. ప్రమోటర్ కిరణ్ కుమార్ స్వయంగా ఈ యాడ్‌లో నటించి, విస్తృతంగా ప్రమోట్ చేశారు. తమ దగ్గర మేకింగ్ చార్జీలు తక్కువగా ఉంటాయని, వేరే సంస్థలతో ధరలను పోల్చి చూసుకున్న తర్వాతే తమ వద్దకు వచ్చి కొనుగోలు చేయాలని సూచించడంతో ఈ స్టోర్ కు ఆదరణ పెరిగింది.

Lalita Jewellery IPO | 63 స్టోర్లు..

బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలకు సంబంధించి విభిన్న డిజైన్స్ రూపొందించడంతో పాటు తయారు చేసే కంపెనీ అయిన లలితా జువెలరీ (Lalita Jewellery) మార్ట్ లిమిటెడ్ .. దక్షిణ భారతదేశంలో బలమైన జువెలరీ రిటైల్ అవుట్ లెట్స్‌ను కలిగి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 63 స్టోర్లను నిర్వహిస్తోంది.

Lalita Jewellery IPO | రూ. 1,700 కోట్ల ఐపీవో..

చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న లలితా జువెలరీ కంపెనీ.. పబ్లిక్ ఇష్యూకు రావాలని నిర్ణయించుకుంది. ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 1,200 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ కిరణ్ కుమార్ తన వాటాను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని 10 కొత్త స్టోర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Lalita Jewellery IPO | ప్రైస్ బ్యాండ్..

కంపెనీ ప్రైస్ బ్యాండ్ ను రూ. 190 నుంచి రూ. 201 లుగా నిర్ణయించింది. ఒక లాట్ లో 74 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,874 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎనఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు.

జీఎంపీ : లలితా జువెలరీ మార్ట్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో షేరు రూ. 35 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 17 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఆగస్టు 17న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. 19తో ముగుస్తుంది. 20న రాత్రి షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ షేర్లు ఆగస్టు 24న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్టవుతాయి. ఆగస్టు 14న యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ విండో తెరుచుకుంటుంది.

ఇది కూడా చదవండి: Indian Stock Market | రెండో రోజూ నష్టాల్లోనే..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *