Star Health Insurance | స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.2 కోట్ల జరిమానా ..

పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్' పై బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ కఠిన చర్యలు తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Star Health Insurance | పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ ‘స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్’ (Star Health and Allied Insurance)పై బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (IRDAI) కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సంస్థకు మొత్తం రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 మధ్య ఐఆర్‌డీఏఐ నిర్వహించిన తనిఖీల్లో వెలుగుచూసిన లోపాల ఆధారంగా ఈ పెనాల్టీని విధించింది.

Star Health Insurance | ఉల్లంఘనకు రూ. కోటి పెనాల్టీ..

పాలసీ నిబంధనలకు విరుద్ధంగా క్లెయిమ్‌లను పరిష్కరించడంతో పాటు, కొవిడ్-19 క్లెయిమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఐఆర్‌డీఏఐ రూ. కోటి జరిమానా విధించింది. పాలసీదారుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడాన్ని రెగ్యులేటరీ సంస్థ తీవ్రంగా పరిగణించింది.

Star Health Insurance | మరో రూ. కోటి జరిమానా..

క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో ఎలాంటి కారణం లేకుండా ఏకపక్షంగా కోతలు విధించడం, క్లెయిమ్‌ను తిరస్కరించడానికి గల స్పష్టమైన కారణాలను పాలసీదారులకు తెలియజేయకపోవడంపై మరో రూ. కోటి జరిమానా వేసింది. భవిష్యత్తులో సరైన, సరైన  కారణం లేకుండా పాలసీదారుల క్లెయిమ్‌లను తిరస్కరించకూడదని స్టార్ హెల్త్ సంస్థకు ఐఆర్‌డీఏఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Paddy Farmers | వ్యవసాయ అధికారుల తప్పిదం.. రైతుల పాట్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *