Paddy Farmers | వ్యవసాయ అధికారుల తప్పిదం.. రైతుల పాట్లు

వ్యవసాయ అధికారులు చేసిన తప్పిదంతో రైతులు పంటలు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Farmers | వానాకాలం సీజన్​లో పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అనేక కష్టాలు పడుతున్నారు. చాలా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభం కాలేదు. మరోవైపు ట్రక్​ షీట్లు సైతం రాకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

ఈ సారి వర్షాలు లేకపోవడంతో రైతులు వరి పంటను అనేక కష్టాలు పడి కాపాడుకున్నారు. నీరు లేక దిగుబడి తగ్గింది. మరోవైపు తెగుళ్లతో పంటకు నష్టం వాటిల్లింది. పలు చోట్లు సాగు నీరు అందక పంటలు ఎండిపోయాయి. ఇన్ని కష్టాలు పడి కాపాడుకున్న పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు దొడ్డురకం ధాన్యం సాగు చేశారు. అయితే వ్యవసాయ అధికారులు సర్వే చేసి రైతులు సాగు చేసిన పంటను ఆన్​లైన్​లో నమోదు చేశారు. ఆ సమయంలో అధికారులు చేసిన తప్పిదంతో ప్రస్తుతం రైతులు తిప్పలు పడుతున్నారు.

Paddy Farmers | సన్నరకం ఎంటర్​ చేయడంతో..

ఈ సారి వానాకాలంలో చాలా మంది రైతులు (Paddy Farmers ) సన్న రకాలను సాగు చేశారు. కొంతమంది దొడ్డు రకం కూడా వేశారు. అయితే సర్వే సమయంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, రైతులను అడగకుండా పంటలను నమోదు చేశారు. కార్యాలయాల్లో కూర్చొని దొడ్డు రకం సాగు చేసిన రైతుల సర్వే నంబర్లలో సైతం సన్నాలు సాగు చేసినట్లు ఆన్​లైన్​లో ఎంటర్​ చేశారు. తాజాగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించారు. ఆన్​లైన్​లో ట్రక్​ షీట్​ ఎంటర్​ చేసే సమయంలో వారికి దొడ్డు రకం సాగు చేసినట్లు భూమి చూపెట్టడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ధాన్యం మిల్లులకు చేరినా.. ట్యాబ్​ ఎంటర్​ చేయడానికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే స్పందించడం లేదని వాపోతున్నారు. నిర్లక్ష్యంగా పంటలు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Ind vs NZ Test | ముగిసిన నాలుగో రోజు ఆట.. 233 పరుగుల లీడ్​లో భారత్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *