Bullet Reddy Movie | ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై ‘బుల్లెట్ రెడ్డి’ షూటింగ్

పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపై ‘బుల్లెట్ రెడ్డి’ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Bullet Reddy Movie | పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపై ‘బుల్లెట్ రెడ్డి’ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంతో ఆర్మూర్ (Armoor) ప్రాంతం సినిమా షూటింగ్‌కు వేదికగా మారింది.

Bullet Reddy Movie | సిద్ధుల గుట్టపై సుందర దృశ్యాలు..

Bullet Reddy Movie

కొడాలి రోహిణి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆదినారాయణ రెడ్డి హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ‘బుల్లెట్ రెడ్డి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా పావని, మేఘ, హానిక నటిస్తున్నారు.కెమెరామెన్‌గా శంకర్ దేవ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ముఖ్య పాత్రల్లో నాని బాబు, శృతి తదితరులు నటిస్తున్నారు.నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు, గుట్ట ప్రాంతంలోని లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్‌ను చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఇతర వివరాలను విడుదల చేయనున్నట్లు నిర్మాత కొడాలి రోహిణి తెలిపారు.

ఇది కూడా చదవండి..: Power Cut | రేపు నగరంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *