Cairo Fuel Tanker Crash | ఈజిప్టులో ఘోర అగ్నిప్రమాదం.. కైరో రింగ్ రోడ్డుపై పేలిన ఫ్యూయల్ ట్యాంకర్.. 30 మంది సజీవదహనం!

అతివేగం, అధ్వాన్నమైన రహదారులు, ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cairo Fuel Tanker Crash | ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే రింగ్ రోడ్డుపై ఇంధన ట్యాంకర్ (Fuel Tanker) ప్రమాదానికి గురై భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 30 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘోర దుర్ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటల తీవ్రతకు రెండు డజన్లకు పైగా కార్లు, మోటార్ సైకిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

Cairo Fuel Tanker Crash | మంటల్లో చిక్కుకున్న వాహనాలు!

గ్రేటర్ కైరో పరిధిలోని గిజా (Giza) ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే అల్-వరాక్ (Al-Warraq) సమీపంలోని రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ఢీకొన్న వెంటనే ఇంధనం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెప్పపాటు వ్యవధిలోనే ఆ మంటలు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలకు వ్యాపించాయి.

వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా మంటలు చుట్టుముట్టడంతో పలువురు లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని తాకాయి. అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రంగంలోకి దిగి మండుతున్న కార్ల నుంచి బాధితులను బయటకు తీశాయి.

Cairo Fuel Tanker Crash | డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపు..

ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ సిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో, బాధితులను గుర్తించేందుకు డీఎన్‌ఏ (DNA) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ తెలిపారు. ప్రస్తుతం వెల్లడించిన మృతుల సంఖ్య ప్రాథమికమేనని, తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Cairo Fuel Tanker Crash | ఈజిప్టులో ఆగని రహదారి మరణాలు

ఈజిప్టులో రవాణా భద్రతా ప్రమాణాలు బలహీనంగా ఉండటం వల్ల ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, అధ్వాన్నమైన రహదారులు, ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదే ఏడాది జనవరిలో దక్షిణ ప్రావిన్స్ బెని సూఫ్ సమీపంలో జరిగిన భారీ వాహనాల ప్రమాదంలో 21 మంది మరణించగా, 16 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా కైరో రింగ్ రోడ్డు ప్రమాదం ఆ దేశంలో మరోసారి విషాద ఛాయలు నింపింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *