టెక్నాలజీOben Rorr EVO | దేశీయ ఈవీ బైక్.. మైలేజీలో టాప్.. సింగిల్ ఛార్జ్‌తో 180...

Oben Rorr EVO | దేశీయ ఈవీ బైక్.. మైలేజీలో టాప్.. సింగిల్ ఛార్జ్‌తో 180 కి.మీ. రేంజ్!

స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు ఓబెన్ ఎలక్ట్రిక్.. సరికొత్త బైక్ ను లాంచ్ చేసింది. రోర్ ఈవీవో పేరుతో తీసుకువచ్చిన ఈ బైక్‌లు వచ్చేనెలలో రోడ్డెక్కనున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Oben Rorr EVO | భారత మార్కెట్​లో సంచలనం సృష్టించేందుకు మరో బైక్ రెడీ అవుతోంది. స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు అయిన ఓబెన్ ఎలక్ట్రిక్.. రోర్ ఈవీవో పేరుతో దీనిని తీసుకువస్తోంది. సింగిల్ చార్జ్‌తో 180 కి.మీ. రేంజ్ ను అందిస్తుందని చెబుతోంది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 1,24,999 గా నిర్ణయించింది. కాగా ప్రారంభ ఆఫర్ లో భాగంగా రూ. 99,999 (ఎక్స్ షోరూం) లకే అందించనున్నట్లు తెలిపింది. ఇది మొదటి 10 వేల మంది కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. రూ. 777తో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 150 షోరూమ్‌లలో టెస్ట్ రైడ్‌లు, కస్టమర్ డెలివరీలు వచ్చేనెల నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ బైక్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

Oben Rorr EVO | డిజైన్ , ఫీచర్లు..

ఓబెన్ రోర్ ఈవీవో ముందు భాగంలో సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్, Horizontal DRLs కొత్త ఫ్రంట్ ఎండ్ ఉంది. సీటు కింద 6 లీటర్ల కంపార్ట్‌మెంట్ రెండు యూఎస్బీ పోర్ట్‌లతో 4 లీటర్ల ట్యాంక్ స్టోరేజ్ ఏరియా ఉన్నాయి. చార్జింగ్ ఆప్షన్‌లలో ఓబెన్ ప్లగ్ స్టాండర్డ్ 15ఏ సాకెట్ల కోసం ఓబెన్ పోర్ట్‌న్నాయి.

ఏఆర్ఎక్స్ ప్లాట్‌ఫారమ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఆధారంగా టెలిస్కోపిక్ ఫోర్కులు, 7 ఫేస్ అడ్జెస్ట్ మోనోషాక్ ఉన్నాయి. ఇందులో 270 ఎంఎం డిస్క్ బ్రేకులు, రెండు చక్రాలపై సీబీఎస్ ఉన్నాయి. కొలతలలో సీటు ఎత్తు 780 ఎంఎం, సీటు వెడల్పు 680 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 200 ఎంఎం, మొత్తం బరువు 140 కిలోలు ఉంటాయి.

Oben Rorr EVO | ఇంజిన్ సామర్థ్యం..

ఓబెన్ రోర్ ఈవీవో గరిష్టంగా 9 కేడబ్ల్యూ పవర్‌ను, 250 ఎనఎం గరిష్ట వీల్ టార్క్‌ను అందిస్తుంది. ఇందులో కొత్తగా ఐ -పీఎంఎస్ ఎం మోటార్ అమర్చారు. ఇది 5 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది.

Oben Rorr EVO | బ్యాటరీ సామర్థ్యం..

రోర్ ఈవీవోలో సొంత 3.4 కేడబ్ల్యూహెచ్ అధిక పనితీరు గల ఎలఎఫ్‌పీ బ్యాటరీని అమర్చారు. ఇది సంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే 50 శాతం అధిక ఉష్ణ నిరోధకతను కలిగి ఉంటుందని, అంతేకాక రెండు రెట్లు జీవితకాలాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మోటార్‌సైకిల్‌కు ఐపీ68 రేటెడ్ మోటార్ శక్తిని అందిస్తుంది. బ్యాటరీకి ఎనిమిదేళ్ల వారంటీ ఉంది.

గంటన్నరలో 80 శాతం ఛార్జింగ్..

బైక్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 180 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కాగా రియల్ వరల్డ్ రేంజ్ కొంత తక్కువగా ఉండవచ్చు. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఫాస్ట్ చార్జర్ ద్వారా 90 నిమిషాల్లో 0 -80 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. రోజువారీ చార్జింగ్ కోసం ఆన్‌బోర్డ్ చార్జర్ ఉపయోగపడుతుంది.

అదనపు ఫీచర్లు..

రోర్ ఈవీవోలో 5 ఇంచెస్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎకో, రోడ్, హావోక్, స్మార్ట్ ఐక్యూ అనే రైడింగ్ మోడ్‌లున్నాయి.

స్మార్ట్ ఐక్యూ మోడ్, రైడింగ్ ఆధారంగా రేంజ్ ఏఐని ఉపయోగిస్తుంది. ఎకో మోడ్‌లో టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. ఫాల్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది.

ఒబెన్ ఎలెక్ట్రిక్ యాప్ ద్వారా రైడర్లు రైడ్ హిస్టరీ, జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, ‘ఫైండ్ మై రోర’, 24 7 సర్వీస్ సపోర్ట్‌ను పొందవచ్చు.

కలర్ ఆప్షన్లు..

బ్లూ, రెడ్, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది.

ఇది కూడా చదవండి..: NTPC Jobs 2026 | ఎన్టీపీసీలో ఉద్యోగావకాశాలు.. ఎంపికైతే రూ. 55 వేలపైనే వేతనం!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy murder case | ఒంటరి మహిళలే లక్ష్యంగా దారి దోపిడీ.. వృద్ధురాలి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు!

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy murder case | ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని...

Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

అక్షరటుడే వెబ్‌డెస్క: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో...

Tumakuru family tragedy | పరాయి వ్యక్తి మోజులో భార్య పరారీ.. ఇద్దరు బిడ్డలను చంపి, తండ్రి ఆత్మహత్య!

అక్షరటుడే వెబ్‌డెస్క: Tumakuru family tragedy | కట్టుకున్న భార్య మోసానికి మరో...

Karimnagar substation fire | దుర్షేడ్ సబ్ స్టేషన్‌లో కార్చిచ్చు.. ఎగసిపడుతున్న మంటలు

అక్షరటుడే వెబ్‌డెస్క: Karimnagar substation fire | కరీంనగర్ జిల్లాలో భారీ...