అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jharkhand Double Murder | తోటి కోడళ్లు నిత్యం గొడవ పడుతున్నారు. ఏళ్లుగా ఇద్దరి మధ్య వివాదాలు ఉండటంతో వారి భర్తలు ఇద్దరిని హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది.
జార్ఖండ్ (Jharkhand)లోని గుమ్లాలో తమ భార్యలను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళల మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన శివ శంకర్ సాహు అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి సోదరుడు నవీన్ సాహూ ఉన్నారు. వారి భార్యలు మినీ ప్రియ (28), రాధిక కుమారి (20) మధ్య కొన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి. దీంతో వారిని ఇద్దరు సోదరులు సోమవారం హత్య చేశారు.
Jharkhand Double Murder | అటవీ ప్రాంతంలో..
హత్య అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లో తరలించి, పొరుగున ఉన్న సిమ్డేగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో పాతి పెట్టారు. అనంతరం తమ భార్యలు ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు విచారించగా.. తామే హత్య చేశామని అంగీకరించారు. దీంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల తల్లిదండ్రులైన సామేశ్వర్ సాహు, తిలేశ్వరి దేవిలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Congress Petition Against Meta | సోషల్ మీడియా వేదికపై రాజకీయ రగడ.. మెటా (Meta)పై ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్! రాహుల్ గాంధీ పోస్టుల నియంత్రణపై తీవ్ర ఆరోపణలు!