Fish Market Raid | చేపల మార్కెట్​లో టీజీ సేఫ్​ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ నగరంలో అతి పెద్దదైన రామ్​నగర్​ చేపల మార్కెట్​లో శుక్రవారం ఉదయం టీజీ సేఫ్​ అధికారులు దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fish Market Raid | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అతి పెద్దదైన రామ్​నగర్​ చేపల మార్కెట్​లో శుక్రవారం ఉదయం టీజీ సేఫ్​ అధికారులు దాడులు చేశారు. పాడిపోయిన 40 కిలోల చేపలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

టీజీ సేఫ్ అధికారులు బేగంపేట్, రామ్ నగర్‌లోని చేపల మార్కెట్లలో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు దుకాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటిని మూసి వేయాలని ఆదేశించారు. పాడైన చేపలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేపలు విక్రయించే ప్రాంతంలో పరిశుభ్రత పాటించాలని, ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్షం వహించొద్దన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Police | వివాహ ఊరేగింపులో కత్తులతో విన్యాసం.. నలుగురి అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *