అక్షరటుడే, వెబ్డెస్క్: Ponnam Prabhakar | విద్యార్థులు సెల్‌ఫోన్లలో ఆటలు, సోషల్ మీడియాకు పరిమితం కావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారిలోని సృజనాత్మకత బయటకు వచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఇర్రంమంజిల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 54వ హైదరాబాద్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఐదు విభిన్న విభాగాల ద్వారా 392 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
Ponnam Prabhakar | సమస్యలు పరిష్కరించే దిశగా..
నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు అని పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా కొత్త విషయాలను అన్వేషిస్తూ, సమాజంలోని సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని సూచించారు. సెల్‌ఫోన్లలో ఆటలకే పరిమితం కాకుండా విజ్ఞాన అన్వేషణ, సృజనాత్మకత వైపు పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Fish Market Raid | చేపల మార్కెట్లో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు