Tata Tea Gemini | ‘నెవర్ కాంప్రమైజ్’ ప్రచారాన్ని ప్రారంభించిన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని..

టీ విషయంలో కచ్చితమైన అభిరుచులు ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని టాటా టీ చక్ర గోల్డ్ జెమిని సరికొత్త ‘నెవర్ కాంప్రమైజ్’ ప్రచారాన్ని ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tata Tea Gemini | టీ విషయంలో కచ్చితమైన అభిరుచులు ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని టాటా టీ చక్ర గోల్డ్ జెమిని సరికొత్త ‘నెవర్ కాంప్రమైజ్’ (Never Compromise) ప్రచారాన్ని ప్రారంభించింది. తెలుగు కుటుంబాల రాజీపడని మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ, గాఢమైన రుచి, సువాసన, నాణ్యత కలిగిన జెమిని టీ ప్రత్యేకతలను మరిన్ని కుటుంబాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. ఏనుగుల శక్తికి ప్రతీకగా నిలిచే ‘గజబలం’ అనే ప్రధాన భావనతో ఈ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు.

Tata Tea Gemini | అస్సాం టీ ఆకుల గాఢమైన రుచి..

బ్రహ్మపుత్ర లోయ నుంచి సేకరించిన అస్సాం టీ  ( Assam Tea )ఆకులతో తయారైన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని డస్ట్ టీ మిశ్రమం, పాలలో కలిపిన తర్వాత కూడా చిక్కదనాన్ని, సువాసనను అందిస్తుంది. తెలుగు సినీ శైలిలోని ఉత్కంఠ, హాస్యాన్ని మేళవిస్తూ రూపొందించిన ఈ ప్రకటనలో ఒక మహిళా అధికారి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి బెదిరింపులకు తలొగ్గని ఆమె, సాధారణ రుచి కలిగిన టీని తిరస్కరించి టాటా టీ చక్ర గోల్డ్ జెమినినే ఎంచుకోవడం, ఆ సమయంలో దూసుకొచ్చే ఏనుగుల సన్నివేశాల ద్వారా ‘గజబలం’ భావనను చూపించారు. దీనితో పాటు టీ కల్తీ నిరోధకతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మరో డిజిటల్ చిత్రాన్ని కూడా విడుదల చేశారు.

Tata Tea Gemini | ప్రతి కప్పులో నాణ్యత..

ఈ ప్రచారం గురించి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ (ప్యాకేజ్డ్ బేవరేజెస్ అండ్ ఆర్గానిక్ ఇండియా) శరత్ వర్మ మాట్లాడుతూ.. వినియోగదారులకు తమకు ఎలాంటి టీ కావాలో స్పష్టమైన అవగాహన ఉంటుందని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే బ్రాండ్లు అత్యుత్తమ నాణ్యతను అందించాలని పేర్కొన్నారు. తెలుగు సినిమా శైలి, హాస్యాన్ని జోడిస్తూ ‘గజబలం’ ద్వారా తమ టీ బలమైన రుచిని ఆవిష్కరించామని, మరిన్ని కుటుంబాలు జెమిని టీని ప్రయత్నించాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. ఇప్పటికే తమ బ్రాండ్‌ను ఆదరిస్తున్న కుటుంబాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సృజనాత్మక ఆలోచన వెనుక తెలుగు కథన శైలి: టీమ్ ఆడాసియస్
ఈ ప్రచార చిత్రం రూపకల్పన గురించి టీమ్ ఆడాసియస్ స్పందిస్తూ.. టీ ప్యాకెట్ ఎంపికను కూడా ఒక గుర్తుండిపోయే అనుభూతిగా మార్చాలనే ఆలోచనతో దీనిని రూపొందించినట్లు తెలిపింది. అడవి నేపథ్యం, ఏనుగుల సన్నివేశాలతో తెలుగు సినీ కథన శైలిని జోడించడం వల్ల జెమిని ‘గజబలం’ భావన ప్రేక్షకులకు బలంగా చేరువైందని వివరించింది.

ఇది కూడా చదవండి: SAP Job Cuts | AI దెబ్బ.. SAPలో 10 వేల ఉద్యోగాల కోత..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *