PM Modi Meeting | బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Meeting | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. పార్లమెంటరీ పార్టీ కార్యవర్గంతో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్​ బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలోనే మోదీ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు సభలో తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతూ బీజేపీ తన లోక్‌సభ సభ్యులందరికీ త్రీ-లైన్ విప్ జారీ చేసింది. దీంతో డీలిమిటేషన్​ బిల్లుపై ప్రధాని నేతలతో చర్చించినట్లు సమాచారం. బిల్లు ఆమోదం కోసం మద్దతు కూడగట్టడం, బిల్లు గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

PM Modi Meeting | 850కి చేరనున్న ఎంపీల సంఖ్య

ఈ సమావేశాల్లో కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన సవరించిన బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది ఆమోదం పొందితే లోక్​సభ ఎంపీల సంఖ్య 850కి చేరనుంది. ఇందులో రాష్ట్రాల నుండి గరిష్టంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 మంది సభ్యులు ఉంటారు.

దీనిని కూడా చదవండి : Rayapati Sambasiva Rao | మాజీ ఎంపీ సాంబశివరావు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *