అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi Meeting | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంటరీ పార్టీ కార్యవర్గంతో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలోనే మోదీ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు సభలో తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతూ బీజేపీ తన లోక్‌సభ సభ్యులందరికీ త్రీ-లైన్ విప్ జారీ చేసింది. దీంతో డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని నేతలతో చర్చించినట్లు సమాచారం. బిల్లు ఆమోదం కోసం మద్దతు కూడగట్టడం, బిల్లు గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలిసింది.
PM Modi Meeting | 850కి చేరనున్న ఎంపీల సంఖ్య
ఈ సమావేశాల్లో కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన సవరించిన బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది ఆమోదం పొందితే లోక్‌సభ ఎంపీల సంఖ్య 850కి చేరనుంది. ఇందులో రాష్ట్రాల నుండి గరిష్టంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 మంది సభ్యులు ఉంటారు.
Excellent meeting with the BJP Parliamentary Party Executive Committee at 7, LKM. Had productive conversations on various subjects. https://t.co/N5zyLT7u0r
— Narendra Modi (@narendramodi) November 29, 2026
దీనిని కూడా చదవండి : Rayapati Sambasiva Rao | మాజీ ఎంపీ సాంబశివరావు మృతి