అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pilot Doping Test | ఎయిర్ ఇండియా (Air India) ఫుకెట్-ఢిల్లీ విమాన దుర్ఘటన తర్వాత.. పైలట్లకు ఏడాదికి ఒకసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి పైలట్ యేటా కనీసం ఒక్కసారైనా డోపింగ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.
Pilot Doping Test | వందశాతానికి పెంపు
నిబంధనల ప్రకారం ప్రతి యేటా మొత్తం పైలట్లలో 10 శాతం మందికి యాదృచ్ఛికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే నూతన ప్రతిపాదిత విధానం ప్రకారం దీనిని వందశాతానికి పెంచనున్నారు. తద్వారా ప్రతి పైలట్‌కు ఏడాదికి కనీసం ఒక్కసారైనా పరీక్ష చేయిస్తారు. అయితే.. భద్రతా ప్రయోజనాలు, విమానయాన సంస్థలపై సాధ్యమయ్యే కార్యాచరణ ప్రభావాన్ని డీజీసీఏ అంచనా వేస్తున్నందున.. ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Pilot Doping Test | ఫుకెట్ – ఢిల్లీ విమాన ఘటన నేపథ్యంలో..
ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. కొన్ని సెకన్లలోనే 300 అడుగులు కిందకు పడిపోవడంతో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ సంస్కరణాత్మక చర్య తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో పైలట్ గంజాయి మత్తులో విమానం నడిపినట్లు డోప్ టెస్ట్‌లో తెలిసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Allahabad High Court Hijab | హిజాబ్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు