జాతీయంSun TV Shares | తమిళనాడులో డీఎంకే ఓటమి.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు!

Sun TV Shares | తమిళనాడులో డీఎంకే ఓటమి.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు!

తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రభంజనంతో డీఎంకే అధికారానికి దూరమయ్యింది. దీని ప్రభావం సన్ టీవీ షేర్లపై కనిపించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sun TV Shares | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu Assembly Elections) ఫలితాల్లో అనూహ్యంగా సినీ హీరో సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే(Tamizhaga Vetri Kazhagam) పార్టీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. విజయ్ ప్రభంజనంతో డీఎంకే అధికారానికి దూరమయ్యింది.

ఈ క్రమంలో ప్రముఖ టెలివిజన్ సంస్థ సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో 10 శాతం పడిపోయి రూ. 547.55 వద్ద లోయర్ సర్క్యూట్ ను తాకాయి. ఆ తర్వాత కాస్త కోలుకుని రూ. 566 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Sun TV Shares | ఎందుకు పడిపోయాయంటే..

సన్ గ్రూప్ నకు చెందిన సన్ టీవీ నెట్ వర్క్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవడు, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ (CM M.K. Stalin) మేనల్లుడు అయిన కళానిధి మారన్ (Kalanithi Maran)కు చెందినది. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సన్ టీవీకి రాజకీయంగా మద్దతు లభించింది. ప్రస్తుత ఎన్నికలలో డీఎంకే పరిస్థితి దిగజారి థర్డ్ పొజిషన్‌కు పడిపోయింది. దీంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం మారితే తమిళనాడులో సన్ టీవీకి ఉన్న గుత్తాధిపత్యం తగ్గి, మీడియా రంగంలో కొత్త పోటీ లేదా నిబంధనలు వస్తాయన్న భయాలతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో కంపెనీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం 10.25 గంటల ప్రాంతంలో 10 శాతం పతనమయ్యాయి. ఆ తర్వాత సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు కాస్త కోలుకున్నాయి. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 6.50 శాతం నష్టంతో రూ. 566 వద్ద కదలాడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Mamata Banerjee Statement| అంతిమ విజయం తృణమూల్ దే.. బెంగాల్ గడ్డపై దీదీ ధీమా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Bengal Victory|పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా...

Kamareddy Municipal Commissioner | కామారెడ్డి,ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: Kamareddy Municipal Commissioner | కామారెడ్డి జిల్లా (Kamareddy...

CPO Teachers Issue | సీపీవోలుగా ఉపాధ్యాయులను సమంజసం కాదు

అక్షరటుడే, కామారెడ్డి: CPO Teachers Issue | రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో...

Kamareddy Fire Victims | బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Victims | పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద...