ఆంధ్రప్రదేశ్​Pawan Kalyan Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యవసర శస్త్రచికిత్స.. నిల‌క‌డ‌గా ఆరోగ్యం

Pawan Kalyan Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యవసర శస్త్రచికిత్స.. నిల‌క‌డ‌గా ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan Surgery | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan) శనివారం సాయంత్రం అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర శారీరక శ్రమ, పని ఒత్తిడి కారణంగా అస్వస్థతకు లోనవుతున్న ఆయన, అధికారులతో నిర్వహించిన సమీక్ష మధ్యలోనే అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ పరిణామంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించగా, పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసేందుకు ఎంఆర్ఐ స్కాన్ సహా పలు పరీక్షలు చేశారు. రిపోర్టులను పరిశీలించిన వైద్యుల బృందం ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించింది.

Pawan Kalyan Surgery | అత్య‌వ‌స‌ర శ‌స్త్ర‌చికిత్స‌..

దాదాపు గంటన్నర పాటు సాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు ఎదురైన అసలు ఆరోగ్య సమస్యపై అధికారిక సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఇది వ్యక్తిగత గోప్యత కారణంగానే ఉంచినట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స అనంతరం కనీసం పది రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కాలంలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు, అధికారిక పర్యటనలు చేయకూడదని స్పష్టం చేశారు. ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

Pawan Kalyan Surgery | పర్యటనలు వాయిదా

పవన్ కళ్యాణ్ చేపట్టాల్సిన జిల్లాల పర్యటనలు, శాఖల పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో (Politics) బిజీగా ఉన్నారు. చివ‌రిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.

దీనిని కూడా చదవండి : Delhi Capitals Win | వాట్ ఏ మ్యాచ్.. మిల్లర్ మాయాజాలం, థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలిచిన డీసీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...