Harvester Fire Accident | కరెంట్ షాక్​తో హార్వెస్టర్ దగ్ధం

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Harvester Fire Accident | కరెంట్ షాక్ తగిలి హార్వెస్టర్ దగ్ధమైంది. ఈ ఘటన సదాశివనగర్ మండలం (Sadasivanagar Mandal) మర్కల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో వీర హనుమాండ్లు సమీపంలో వరి కోతలు కోసి హార్వెస్టర్ మిషన్ రోడ్డు దాటుతోంది.

Harvester Fire Accident | దగ్ధమైన హార్వెస్టర్

ఎల్టి వైర్లు కిందికి ఉండడంతో ప్రమాదవశాత్తు హార్వెస్టర్​కు తగలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి డ్రైవర్ చాకా చక్యంగా తప్పించుకున్నాడు. డ్రైవర్​కు ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన హార్వెస్టర్ ఇందల్వాయి మండలం (Indalwai Mandal) చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్​కు చెందినదిగా గుర్తించారు.

ఇది కూడా చదవండి..: Deeksha Success Story | ఒత్తిడి లేని చదువు.. పక్కా ప్రణాళికే నా విజయ రహస్యం: ఎస్సెస్సీ జిల్లా సెకండ్​ టాపర్​ దీక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *