అక్షరటుడే వెబ్‌డెస్క్:Rahul Gandhi Allegations| అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సహకారంతో బీజేపీ ప్రజా తీర్పును తారుమారు చేసిందని, బెంగాల్‌లో సుమారు 100కు పైగా సీట్లను ఆ పార్టీ దొంగిలించిందని రాహుల్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలకు ఆయన మద్దతు పలికారు.
Rahul Gandhi Allegations| ప్లేబుక్’ను వాడి అధికారంలోకి ..
కేవలం ఇప్పుడే కాకుండా, గతంలోనూ బీజేపీ ఇలాంటి అక్రమ పద్ధతులనే అనుసరించిందని రాహుల్ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే తరహా ‘ప్లేబుక్’ను వాడి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను బీజేపీ అడ్డదారిలో మలచుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Rahul Gandhi Allegations| రాహుల్ వైఖరిని తప్పుబడుతూ..
అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేరళ, తమిళనాడు ఫలితాలను అంగీకరిస్తూ.. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లోనే అక్రమాలు జరిగాయని చెప్పడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nizampet Fire Accident | నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వరుసగా ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం, స్థానికుల్లో ఆందోళన!

