జాతీయంUdhayanidhi Stalin | తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి!

Udhayanidhi Stalin | తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి!

తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే పార్టీ ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో నేడు పార్టీ అధినేత స్టాలిన్‌ సమావేశం నిర్వహించనున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udhayanidhi Stalin | తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే పార్టీ ఎన్నుకోనున్నట్లు సమాచారం. నిన్న వెలుడిన ఫలితాల్లో డీఎంకే కూటమి ఓడిపోయిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం స్టాలిన్ (CM Stalin)​ తన నియోజకవర్గంలో ఓడిపోయారు.

స్టాలిన్​ ఓటమితో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో నేడు డీఎంకే అధినేత స్టాలిన్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ పరాజయానికి గల కారణాలతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు స్టాలిన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Udhayanidhi Stalin | 59 స్థానాల్లో విజయం

ఎన్నికల్లో డీఎంకే కూటమి 73 స్థానాల్లో గెలుపొందింది. సొంతంగా డీఎంకే (DMK) 59 చోట్ల విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. మరోవైపు అన్నాడీఎంకే 47, కాంగ్రెస్​ 5, పీఎంకే 4, ముస్లిం లీగ్​ 2, సీపీఐ 2, వీసీకే 2, సీపీఎం 2, బీజేపీ 1, డీఎండీకే ఒక స్థానంలో విజయం సాధించాయి. టీవీకే పార్టీ 108 చోట్ల గెలిచి మ్యాజిక్​ ఫిగర్​కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే చిన్న పార్టీల సాయంతో విజయ్ సీఎం కానున్నారు. ఇప్పటికే టీవీకే మద్దతు తెలుపుతామని లెఫ్ట్​ పార్టీలు ప్రకటించాయి. ఈ రోజు విజయ్​ (Vijay) గవర్నర్​ను కలవనున్నారు. దీంతో ఆయనతో ఎవరు వస్తారనేది కొద్ది సేపట్లో తేలనుంది.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Allegations| ఎన్నికల ఫలితాల్లో ‘బీజేపీ ప్లేబుక్’.. ఈసీ సహకారంతోనే అక్రమాలు: రాహుల్ గాంధీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో...

Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​వో, ఆర్డీవోల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad DRO Appointments |  రాష్ట్రంలో పలువురు అదనపు...

West Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం...

BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Victory Celebration | వెస్ట్ బెంగాల్, అస్సాం,...